గుంటూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని ఎస్టీ కాలనీలోకి నీరు చేరగా.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బాపట్ల మండలం మూలపాలెంలో జగనన్న కాలనీలోకి వాన నీరు చేరింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. ఈపూరు మండలం కొండ్రముట్లలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. మూడు గంటలకు పైగా కురిసిన వానతో జనజీవనం స్తంభించింది. కుండపోత వర్షంతో రహదారులపైకి నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. దుకాణాల ముందుంచిన వాహనాలు సగం మేర నీటిలో మునిగాయి. వర్షపు నీటిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిలకలూరిపేట మండలం మానుకొండవారి పాలెం-వేలూరు మధ్య ఉన్న కుప్పగంజి వాగు ఉద్ధృతికి చౌటుపల్లి దాసు అనే యువకుడు కొట్టుకొని పోగా..పోలీస్, రెవెన్యూ ,అగ్నిమాపక సిబ్బంది అతడిని కాపాడారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈపూరు మండలం కొండ్రముట్లలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. కుప్పగంజి వాగు ఉద్ధృతికి ఓ యువకుడు కొట్టుకుపోగా అధికారులు రక్షించారు.
heavy rains