PACS: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో నలుగురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు, పాసు బుక్ లు తనఖా పెట్టి రూ. 24 లక్షలు రుణం తీసుకొని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు కలసి సంఘాన్ని మోసం చేశారని పాలక వర్గం సభ్యులు వారం రోజుల క్రితం జిల్లా జీడీసీసీ బ్యాంకు అదికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఇలా జరిగింది...
2020 సంవత్సరంలో నలుగురు కొత్త వ్యక్తులు పేరేచర్లలో ఉన్న పీఏసీఏస్ కు వచ్చారు. రుణం కావాలని అడిగారు. మాచవరాం మండలంలో పొలం ఉందని నమ్మించారు. పేరేచర్ల, డోకిపర్రు గ్రామానికి చెందినవారుగా దొంగ ఆధార్ కార్డులు సృష్టించారు. పొలం పాస్ పుస్తకాలు తనఖా పెట్టారు. ఆ నలుగురు కలసి మొత్తంగా రూ. 24 లక్షలు రుణం తీసుకున్నారు. ఈనెల మార్చి ప్రారంభంలో రెన్యూవల్ కోసం అధికారులు రికార్డులు తిరగేస్తుండగా నలుగురు తనఖా పెట్టిన పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు నకిలీవని గుర్తించారు. ఈ ఘటనపై పాలక వర్గం సభ్యులు వారం క్రితం గుంటూరు జీడీసీసీ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదే నలుగురు వ్యక్తులు గుంటూరు చుట్టు పక్కల సొసైటీల్లో కూడా ఇదే తరహాలో లోన్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి :
Jada Sravan Kumar Party: అంబేడ్కర్ జయంతి రోజు పార్టీ ప్రకటన: జడ శ్రావణ్ కుమార్