గుంటూరు తాడి కొండ మండలం బండారుపల్లి గ్రామంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ తగాదాలో కొడుకు తండ్రి ని గట్టిగా కొట్టి కింద పడవేశాడు. తండ్రి తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలొదిలాడు.
గొడవకు గల కారణమేంటి...

బండారుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న 85 ఏళ్ల కళ్లే పాపయ్యకు ఐదుగురు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రీ కొడుకులు అంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఒక గదిలో వృద్ధ దంపతులుండగా...వారిద్దరి కుమారులూ చెరో గదిలో ఉంటున్నారు. చిన్న కుమారుడు నారాయణ మద్యానికి బానిసైయ్యాడు. ఎప్పుడూ మద్యం తాగి వచ్చి ఆ ఇంటిని తన పేరు మీద రాయమని తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. ఈ రోజు కూడా ఎప్పటిలాగే పీకలదాకా మద్యం తాగి నారాయణ.. ఆస్తి కోసం తల్లిదండ్రులతో తగాదా పడ్డాడు. ఆ ఘర్షణలో నారాయణ తండ్రి పాపయ్యను పైకి ఎత్తి కింద పడవేశాడు. బలంగా కిందకు పడేయటంతో పాపయ్య తలకు తీవ్రం గాయాలయ్యాయి. ఈ ఘటనలో పాపయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు నారాయణను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : murder case chased: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య