ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: హోంమంత్రి సుచరిత

గుంటూరు ఆర్​వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 2 కోట్లతో నిర్మించిన ఇండోర్ క్రీడా ప్రాంగణాన్నిహోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. నూజివీడులోని కృష్ణా యూనివర్సిటీలో రూ. 5 కోట్ల 50 లక్షలతో చేపట్టిన అకాడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ శంకుస్థాపన చేశారు.

suresh inaugurate new building at krishna university
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

By

Published : Aug 11, 2021, 7:14 PM IST

గుంటూరు ఆర్​వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ క్రీడా ప్రాంగణాన్నిహోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. స్పోర్ట్స్ ప్లెక్స్ పేరుతో నిర్మించిన ఇండోర్ క్రీడా భవనాన్ని ప్రారంభించిన అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వసతులను ఆమె పరిశీలించారు. విద్యార్థులు.. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని హోంమంత్రి సుచరిత అన్నారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలిగి తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడలకు పెద్దపీట వేసి రూ. 2కోట్లతో క్రీడా భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

1985లో ప్రారభించిన ఈ కళాశాలలో ప్రస్తుతం విద్యార్థుల సౌకర్యార్ధం రూ. 2కోట్ల వ్యయంతో స్పోర్ట్స్ ప్లెక్స్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరితతోపాటు కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ గోపాల్ కృష్ణ, ట్రెజరర్ కృష్ణప్రసాద్, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్ క్రీడా ప్రాగణంలో జ్యోతి వెలిగిస్తున్న హోం మంత్రి సుచరిత
కృష్ణా వర్సిటీలో అకాడమిక్ బ్లాక్ ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో విద్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ముఖ్యమంత్రి జగన్​.. అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నూజివీడులోని కృష్ణా యూనివర్సిటీలో రూ. 5 కోట్ల 50 లక్షలతో చేపట్టిన అకడమిక్ బ్లాక్​ నిర్మాణ పనులకు మంత్రి సురేశ్ శంకుస్థాపన చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు పేద వర్గాల్లో విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ కేబి చంద్రశేఖర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్ క్రీడా ప్రాగణాన్ని ప్రారంభించిన హోం మంత్రి సుచరిత

ఇదీ చదవండి...

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,869 కరోనా కేసులు..18 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details