ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'

డీఎస్సీ-2018 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థుల సీఎంవో కార్యాలయంలోని ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు... దీనికి స్పందించిన అధికారులు విద్యాశాఖ కమిషనర్​ సంధ్యారాణికి ఫోన్​ చేసి నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

By

Published : Sep 12, 2019, 12:28 PM IST

Updated : Sep 12, 2019, 1:21 PM IST

'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'

నియామకాలను వెంటనే చేపట్టాలని డీఎస్సీ-2018 అభ్యర్థులు సీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. 'స్పందన' కార్యక్రమంలో అభ్యర్థుల దరఖాస్తు చేశారు. కోర్టు కేసులు లేని డీఎస్సీ-2018 పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసులున్న పోస్టులను నియామక ప్రక్రియ వేగంగా చేయాలని విజ్ణప్తి చేశారు.

దీనికి స్పందించిన సీఎంవో కార్యలయం... విద్యాశాఖ కమిషనర్​ సంధ్యారాణికి ఫోన్​ చేశారు. నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖ కమిషనర్​ను కలవాలన్న సీఎంవో సూచన మేరకు 300పైగా అభ్యర్థులు ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. సత్వరమే తమసమస్య పరిష్కరించాలని కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'
Last Updated : Sep 12, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details