ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులిచింతల 14 గేట్లు ఎత్తి నీరు విడుదల - pulichinthala project news

ఎగువ నుంచి భారీ ప్రవాహాలకు తోడు కృష్ణా పరీవాహకంలో ఏకధాటి వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో సాగర్ నుంచి పులిచింతలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదలచేస్తున్నారు.

drainage-downstream-from-the-pulichinthala-project
పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల

By

Published : Aug 22, 2020, 9:48 AM IST

Updated : Aug 22, 2020, 1:10 PM IST

కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గుంటూరు పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల 14 గేట్లు ఎత్తి 2 లక్షల 47 వేల క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేయగా... విద్యుదుత్పత్తికి కోసం 15 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

పులిచింతల ఇన్‌ఫ్లో 2 లక్షల 10 వేల క్యూసెక్కులు కాగా...అవుట్ ఫ్లో 2 లక్షల 46 వేల900 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 35.02 టీఎంసీల నీరు ఉండగా...పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండాలంటే మరో 10 టీఎంసీల నీరు అవసరం. దిగువకు భారీ స్థాయిలో వరద నీటిని విడుదల చేయడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తంగా ఉండాలన్నారు. పులిచింతల ప్రాజెక్టును కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ పరిశీలించారు. ప్రాజెక్టు నీటి సామర్యం... వరద తీవ్రత గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతుంది. కీసర నుంచి 1,05,945 క్యూసెక్కులు, మున్నేరు నుంచి 53,553, మధిర నుంచి 5,297క్యూసెక్కులు వరద నీరు కృష్ణానదిలో కలుస్తుంది. పులిచింతల నుంచి లక్షా 13వేల 008 క్యూసెక్కలు నీరు ప్రకాశం బ్యారేజీని తాకనుంది. సాగర్ వద్ద 18గేట్లు తెరిచి 3.47లక్షల క్యూసెక్కల నీటిని విడుదల చేశారు. ఆ వరద నీరు పులిచింత చేరుతుంది. వచ్చిన నీటిలో పులిచింతలకు చెందిన 14 గేట్లును తెరిచి 2.50లక్షల వరద నీరు ప్రకాశం బ్యారేజికి విడుదల చేశారు.

నీటి ప్రవాహం వలన జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, రావిరాల గ్రామస్థులను ముందుజాగ్రత్తగా అప్రమత్తం చేశారు. వాగులతో పాటు పులిచింతల నుంచి వచ్చే వరద నీరు ఈరోజు అర్దరాత్రికి 3.50 లక్షల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద బ్యారేజీని తాకుతుందని జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్దకు 2 లక్షల 29వేల 549 క్యూసెక్కుల వరద చేరటంతో 70 గేట్లలో 40గేట్లు మూడు అడుగులు, 30గేట్లు రెండు అడుగులు తెరిచి లక్షా 17వేల 750క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది నుంచి కృష్ణా,గుంటూరు,ప్రకాశం ఉభయగోదావరి జిల్లాలకు 9వేల 800 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు.

ఇవీ చదవండి:
తగ్గని వరద.. జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

Last Updated : Aug 22, 2020, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details