ఆ రైతు ఇంట్లో ఒకే మొక్కకు విభిన్న రంగుల పూలు పూస్తున్నాయి.. ఒకే మొక్కకు టమాటా, వంకాయలు కాస్తున్నాయి. ఒకే మొక్కకు భిన్న రకాలైన పూలు, కాయగూరలు, ఫలాలు పండిస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు అబ్బురపరుస్తున్నారు. ఆర్థికంగా లాభదాయకమైన రీతిలో పోలేశ్వరరావు ఆవిష్కరించిన ఈ విధానం... వ్యవసాయ విద్యార్థులను సైతం ఆకర్షిస్తోంది. సుమారు 20 జాతుల మొక్కల నుంచి ఆయన బహుళ ఉత్పత్తులను పండించగలిగారు. అంటుకట్టే విధానంలో తగిన మెళకువలతో... ఇవన్నీ సులువేనంటున్న పోలేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి..
ఒకే మొక్క... ఎన్నో రకాలు పూలు.. పండ్లు - story on succesfull farmer at guntur
సాధారణంగా ఏదైనా మొక్కకు పండ్లు, కూరగాయలు, పూలు పూయటం చూస్తుంటాం. కానీ ఒకే మొక్కకు భిన్నమైన కూరగాయలు కాస్తాయా, వేర్వేరు రంగుల్లో పూలు పూస్తాయా... రెండు మూడు రకాల కాయలు వస్తాయా... అంటుకట్టే విధానంలో మెళకువలు పాటిస్తే ఇవన్నీ సులువేనంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు.
ఒకే మొక్క... ఎన్నో రకాలు పూలు.. పళ్లు