ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో కరోనా ఉద్ధృతి.. 594కు చేరిన కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 9 మందికి పాజిటివ్​ నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 594కు చేరింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

గుంటూరులో కరోనా ఉద్ధృతి.. 900కు చేరిన కేసులు
గుంటూరులో కరోనా ఉద్ధృతి.. 900కు చేరిన కేసులు

By

Published : Jun 10, 2020, 9:15 PM IST

Updated : Jun 11, 2020, 7:36 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 9 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 594కి చేరింది. ఇప్పటి వరకు గుంటూరు నగరంలో 243 కేసులు నమోదు కాగా.. 59 యాక్టివ్​ కేసులున్నాయి. నరసరావుపేటలో 197 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీటిలో 15 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి.

మిగతా మండలాల్లో 163 కేసులుండగా.. 77 క్రియాశీలంగా ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 48,995 మంది స్వాబ్​ సేకరించగా.. 46,238 మందికి నెగిటివ్​ రిపోర్టు వచ్చిందని అధికారులు తెలిపారు. దాదాపు 99 శాతం మందికి కరోనా లేదని నిర్ధారించారు.

Last Updated : Jun 11, 2020, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details