గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు మందులు అందించటం లేదంటూ.. ఆస్పత్రిలో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్న పేషెంట్లకు మందులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉదయం నుంచి మందుల కోసం పడిగాపులు కాస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
BLACK FUNGUS: మందులు అందటం లేదని.. బ్లాక్ ఫంగస్ రోగుల ఆవేదన - latest news in guntur district
బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు మందులు అందించటం లేదని.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్ ఫంగస్ రోగులు
రోజుల తరబడి మందులు లేక ప్రాణాల మీదకి వస్తుందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ..TDP: 'అక్రమ మైనింగ్‌తో వైకాపా నేతలు దోచుకుంటున్నారు'