ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

.

AP TOP NEWS @1PM
AP TOP NEWS @1PM

By

Published : Dec 19, 2021, 1:01 PM IST

  • చిత్తూరు జిల్లా జి.వి.పాలెం స్వర్ణముఖి వాగులో ముగ్గురు పిల్లలు గల్లంతు

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం స్వర్ణముఖి వాగులో ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. గల్లంతైన గణేశ్‌, డోలా, యుగంధర్‌ కోసం స్థానికులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NO SUPPORT PRICE TO PADDY: పడిపోతున్న ధాన్యం ధరలు.. మోసపోతున్న వరి రైతులు

ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే వరి రైతులు.. దళారుల మాయాజాలానికి తలవంచక తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ముందుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలతో అన్నదాతలు అటువైపు చూడడం లేదు. ఎంతకో కొంతకు ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Nara bhuvaneshwari tour: రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన

రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

కేరళలోని అలప్పుజలో ఇద్దరు రాజకీయ నాయకులు 12 గంటల వ్యవధిలో హత్యకు గురయ్యారు. తొలుత ఎస్​డీపీఐ నేతను కొందరు దుండగులు హత్య చేశారు. దీని వెనక ఆరెస్సెస్ హస్తం ఉందని ఆ పార్టీ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నవజాత శిశువుకు వీధి శునకం రక్షణ- రాత్రంతా..!

ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే.. వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలిచింది. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ ముంగెలీ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అఫ్గాన్​ ప్రజలకు సాయం చేసే మార్గాలను కనుక్కోవాలి'

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని 90 దేశాలకు భారత్​ వ్యాక్సిన్లు పంపించినట్లు చెప్పారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. దిల్లీలో జరిగిన 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో భాగంగా వైరస్​పై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 100కు చేరిన మృతులు!

ఫిలిప్పీన్స్​లో రాయ్​ తుపాను సృష్టించిన బీభత్సానికి మృతుల సంఖ్య వందకు చేరువైంది. ఒక్క బోహోల్​ ప్రావిన్స్​లోనే 49 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీకాలపై వ్యతిరేకత.. మాకొద్దంటూ వేలమంది నిరసనలు

బ్రిటన్​లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో టీకా పంపిణీని ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే బలవంతంగా టీకాలు ఇస్తున్నారంటూ.. నిరసన ప్రదర్శనలు చేపట్టారు అక్కడి పౌరులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ashes 2021: ఇంగ్లాండ్​కు షాక్.. కెప్టెన్ రూట్​కు గాయం

యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు ఓటమితో ఇబ్బందుల్లో పడిన ఈ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు నాలుగో రోజు గాయం కారణంగా ఈ జట్టు కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్​కు దిగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి

సినీ నటి సాయి పల్లవి స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భావోద్వేగానికి గురయ్యారు. తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details