ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసేలా చర్యలు తీసుకోవాలి' - AgriGold

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయిస్తున్నట్లు... త్వరలో జీవో విడుదల చేయనుందని అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సమావేశం

By

Published : Jun 25, 2019, 5:17 PM IST

అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం సమావేశం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1150 కోట్లు కేటాయిస్తూ... ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని బాధితుల సంఘం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం... జీవో విడుదలతోపాటు చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు ద్వారా అనివార్యంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే... ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చెల్లింపులు జరపాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం వేలం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details