గుంటూరు జిల్లాలో కొత్తగా 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 36వేల 882 కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని 27వేల 341మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 4 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 369 కి చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 129 ఉన్నాయి. ఇక మండలాల వారీగా చుస్తే తెనాలి-66, మాచర్ల-87, బాపట్ల-39, సత్తెనపల్లి-32, ఫిరంగిపురం-25, తాడేపల్లి-19, కొల్లూరు-18, మంగళగిరి-17, పిడుగురాళ్ల-15, నరసరావుపేట-14, దుర్గి-12, రెంటచింతల-12 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.