Accident: కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు - కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం
12:27 March 26
కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు..
Road Accident: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. కానీ లారీల మధ్య ఓ కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒక వ్యాన్ నుంచి పాస్పరస్ ట్రైక్లోరైడ్ ద్రావణం లీకవుతోంది. వ్యానులో 200 కేజీల 50 గ్రాముల ఫాస్పరస్ ట్రైక్లోరైడ్ గుర్తించారు. ద్రావణం నుంచి విషతుల్యమైన టాక్సిన్లు వెలువడుతుండటంతో... రసాయన నియంత్రణ నిపుణులు లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రేన్ల సాయంతో వాహనాలను పోలీసులు తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి :Suicide: తిరుపతిలో విషాదం.. ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య