శాఖల మధ్య సమన్వయ లోపంతో వార్డు సచివాలయానికి తాళం పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 25వ నెంబరు వార్డు సచివాలయానికి తాళం వేశారు. ఈ కారణంగా సిబ్బంది ఆరుబయటే పనిచేస్తున్నారు. వార్డు వాలంటీర్లు కార్యాలయం బయటే పింఛన్లు అందించారు. వార్డు సచివాలయానికి అమీనపేట ప్రత్యేక నగర పాలక పాఠశాలలోని ఓ గదిని కేటాయించారు. గతంలో ఇదే గదిలో అంబేడ్కర్ గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. వార్డు సచివాలయం ఏర్పాటు తర్వాత తరలించారు. పూర్తిగా వార్డు సచివాలయ కార్యాలయంగా మార్చిన తరుణంలో తాళం వేయడం చర్చనీయాంశమైంది.
శాఖల మధ్య సమన్వయ లోపం.... సచివాలయానికి తాళం
వార్డు సచివాలయానికి తాళం వేసుకువెళ్లారు అధికారులు. దీనివల్ల ఆరుబయటే సిబ్బంది విధులు నిర్వర్తించారు.
సచివాలయానికి తాళం