ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Sharmila Padayatra : రెండోరోజుకు చేరుకున్న వైఎస్​ షర్మిల పాదయాత్ర - ys sharmila padhayatra updates

తెలంగాణలో వైఎస్​ షర్మిల పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు సుమారు 10 కిలోమీటర్ల వరకు నడిచి.. పలు గ్రామాల ప్రజలను కలిశారు. గ్రామస్థులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు సందర్భంగా ఇవాళ షర్మిల పాదయాత్ర నక్కలపల్లి నుంచి ప్రారంభించారు.

YS Sharmila Padayatra
రెండోరోజుకు చేరుకున్న వైఎస్​ షర్మిల పాదయాత్ర

By

Published : Oct 21, 2021, 1:13 PM IST

ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు సందర్భంగా.. ఇవాళ నక్కలపల్లి నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. నక్కలపల్లి గ్రామస్థులు, రైతులతో షర్మిల సమావేశమయ్యారు. కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ మీదుగా పాదయాత్ర శంషాబాద్ చేరుకోనుంది.

వెంకటాపూర్​లో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విరామం తీసుకుంటారు. తిరిగి 3 గంటలకు వెంకటాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 3:15కు కవాడీగుడా క్రాస్​రోడ్, 4 గంటలకు మల్కాపురం, 5 గంటలకు అందాపూర్, 5:15కు నవాజ్​పూర్ క్రాస్​రోడ్, 5:45కు కాచారం క్రాస్ రోడ్​కు చేరుకుని 6 గంటలకు కాచారం గ్రామంలో బస చేస్తారు.

మొదటి రోజు పాదయాత్ర సాగిందిలా..

నిన్న మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్​పల్లి క్రాస్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ షర్మిల రెండున్నర కిలోమీటర్లు నడిచి.. షాబాద్ క్రాస్​రోడ్​కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్​రోడ్డు వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.

అక్కడ మధ్యాన భోజనం చేశారు. గంట విరామం తర్వాత కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి, అక్కడి నుంచి గుండాల్ క్రాస్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగూడా క్రాస్​రోడ్డుకు చేరుకున్నారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. మొదటిరోజు నక్కలపల్లి సమీపంలో రాత్రి బస చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details