ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి: వైఎస్​ షర్మిల - కేసీఆర్​పై వైఎస్ షర్మిల విమర్శలు తాజా వార్తలు

YS Sharmila Comments on CM KCR: తెలంగాణలో వైఎస్సార్‌ రాజ్యం తేవడమే తన లక్ష్యమని వైఎస్​ షర్మిల అన్నారు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరింది. ఈక్రమంలో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి అని ఆమె ఆరోపించారు.

Sharmila
Sharmila

By

Published : Oct 10, 2022, 8:33 PM IST

YS Sharmila Comments on CM KCR: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పాదయాత్ర.. లింగంపేట్, ఎల్లారెడ్డిలో మండల్లాలో కొనసాగుతోంది. ఈక్రమంలో హాజీపూర్ తండా వద్ద 2500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈసందర్భంగా వైఎస్సార్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడితోనే విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారని వైఎస్​ షర్మిల ఆరోపించారు.

వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని బెదిరించారని వైఎస్​ షర్మిల తెలిపారు. ప్రజల మనోభావాలకు తెలంగాణలో విలువ లేదని.. ఒక మాజీ ముఖ్యమంత్రికి తెరాస ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి అని విమర్శించారు. ఇక్కడ బందిపోట్ల రాజ్యమే నడుస్తోందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో వైఎస్సార్‌ రాజ్యం తేవడమే లక్ష్యమంటూ వైఎస్​ షర్మిల పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి: వైఎస్​ షర్మిల

"ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రశ్నించాల్సిన భాజపా, కాంగ్రెస్​లు ఒక్కరోజైనా కేసీఆర్ మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టలేదని అడిగారా. ఎనిమిది సంవత్సరాలుగా జాబ్​ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎలా అని అడిగారా. అంతా ఒక్కరే. వారంతా వారి స్వార్ధానికే రాజకీయాలు చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరు నిలబెట్టడమే కాదు మళ్లీ ఆ పథకాలను తీసుకురావడానికే వైతెపా పార్టీని పెట్టాను." - వైఎస్​ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details