ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల నిరాాహార దీక్ష.. - వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా సీఎం కేసీఆర్​కు పట్టడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆమె మండిపడ్డారు. నేడు రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లెలో షర్మిల దీక్ష చేపట్టనున్నారు.

SHARMILA_DEEKSHA
నిరుద్యోగుల కోసం నిరాాహార దీక్ష

By

Published : Aug 3, 2021, 7:53 AM IST

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలంటూ.. వైఎస్సార్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేపట్టే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లెలో.. వైఎస్ షర్మిల ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు తెలిపిన పార్టీ నేతలు.. ఉదయం లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి షర్మిల వెళ్తారని వివరించారు. నా చావుకు కారణం నిరుద్యోగం అంటూ ఓ యువకుడు జమ్మికుంట రైల్వే స్టేషన్​ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు.

ఇదీ చదవండి:

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్​ఛార్జీని విచారించిన సీబీఐ అధికారులు

ABOUT THE AUTHOR

...view details