Young Woman Protest Naked : సినీ నిర్మాత తనను పెళ్లి చేసుకోవాలంటూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు సోమవారం తెల్లవారుజామున ఓ యువతి నగ్న ప్రదర్శన చేపట్టింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టు సోమవారం తెల్లవారుజామున ఒంటిపై ఉన్న దుస్తులన్నింటిని తీసేసి నగ్నంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించింది.
గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట...యువతి నగ్న ప్రదర్శన...ఎందుకంటే..?
Young Woman Protest Naked : సినీ నిర్మాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేపట్టింది. అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు గతంలోనూ ఆమె పలుమార్లు ఆందోళన చేపట్టిందని తెలిపారు.
యువతి నగ్న ప్రదర్శన
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఆమెకు దుస్తులు తొడిగారు. జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. ఆమెపై మానసిక స్థితి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఆమె పలుమార్లు ఆందోళన చేపట్టింది.
TAGGED:
Young Woman Protest Naked