Young man killed in patancheru: అమ్మాయి, అబ్బాయిలది ఒకే ఊరు. కులాలు వేరు. పరస్పరం ప్రేమించుకున్నారు. ఒకరోజు రాత్రి యువతి ఫోన్ చేయగా యువకుడు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు చివరకు యువకుడు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి, బాలేశ్వరమ్మ దంపతులు 20 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతానికి వలస వచ్చారు. కూలి చేసుకుంటూ శివారు ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరి రెండో కుమారుడు శివకుమార్(18), కోడేరు గ్రామానికే చెందిన, ప్రస్తుతం ముషీరాబాద్‌లో ఉంటున్న దంపతుల కుమార్తెను ప్రేమించాడు. ఆమె ఇంటర్ చదువుతోంది. ప్రేమ వ్యవహారం ఇటీవల అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు కుమార్తెను మందలించారు.
మాట్లాడదామని వెంట తీసుకెళ్లి...మట్టుబెట్టారు - ఏపీ తాజా వార్తలు
Young man killed in patancheru: అమ్మాయి, అబ్బాయిలది ఒకే ఊరు. కులాలు వేరు. పరస్పరం ప్రేమించుకున్నారు. ఒకరోజు రాత్రి యువతి ఫోన్ చేయగా యువకుడు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు చివరకు యువకుడు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు.
యువకుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్న యువతి తండ్రి, బాబాయ్‌లు ఈ నెల 7న అమ్మాయితో ఫోన్ చేయించాారు. ముషీరాబాద్‌కు రావాల్సిందిగా కోరారు. అక్కడివరకూ రాలేనని తెలపడంతో అమీర్‌పేటకైనా రావాలని సూచించారు. అక్కడికి యువకుడు వెళ్లగా, మాట్లాడదామంటూ వెంట తీసుకెళ్లారు. అప్పట్నుంచి అతని ఆచూకీ లేదు. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు తొలుత అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రేమ వ్యవహారం తెలుసుకుని ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. యువతి తండ్రి, బాబాయ్‌లను విచారించారు. వారిద్దరూ హత్య చేసినట్లుగా దాదాపు నిర్ధారణకు వచ్చారు. హత్య అనంతరం మృతదేహాన్ని కుషాయిగూడెం వద్ద కాలువలో పడేసినట్టు తెలుసుకుని గురువారం గాలింపు చేపట్టారు. మృతదేహం దొరికితే పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: