తండ్రి జీవితచరమాంకంలోనూ ఏ కష్టం రానీవ్వకుండా అమ్ముల పొదిలో దాచుకుని కాపాడుకుంటానని ధైర్యం చెప్పే రోజు. జన్మనిచ్చిన తండ్రి ఆశయాలను ఒంట బట్టించుకుని... బిడ్డగా సాధిస్తానని నాన్నకు మాటిచ్చే రోజు.
- 1910లో తొలిసారి ఫాదర్స్‌డే
ఏటా జూన్ నెల మూడో ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవంగా ప్రకటించుకుని వేడుకలు జరుపుకుంటున్నాయి. బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా 'స్మార్ట్ డాడ్' పేరిట ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి 'ఫాదర్స్ డే'ను గుర్తించి జరుపుకున్నారు.
- కుమార్తెకు తండ్రే తొలి బిడ్డ..
సహజంగా కూతురుకు తండ్రి అంటే ప్రత్యేకమైన అభిమానం.. అనుబంధం.. రోల్ మోడల్.. ఓ హీరో.. కూతురు నాన్నను అభిమానించేది ఎంతగా అంటే తండ్రి కుమార్తె మాట తప్ప ఇంట్లో మరొకరి మాట విని అవకాశం లేనంతగా. ఆడపిల్ల పుట్టడమే ఆలస్యం తన తల్లే మళ్లీ పుట్టిందని ఆ తండ్రి ఉబ్బితబ్బిపోతాడు. అన్న ప్రాసన నుంచి ఉన్నత విద్యాభ్యాసం వరకు చెమట చిందించి వేలు, లక్షలను నోట్లుగా మార్చి పిల్లల ఎదుగుదలలో ప్రథమ స్థానంలో కొనసాగుతాడు. కొలువులు వచ్చాక ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి లక్షల రూపాయల కట్నంతో వివాహం జరిపిస్తారు. ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ... అల్లరిమూకలను ఎదుర్కొనే సమయంలో తన ప్రాణాలనూ పణంగా పెట్టే సాహసం, త్యాగం పేరే 'నాన్న' .
- వారసుడు అని చేరదీస్తాడు నాన్న..