ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో నేటినుంచి 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్‌..! - 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్‌ షో

నింగిలో విహరించే విమానాలు.. నేల మీద ప్రదర్శనగా కొలువు దీరనున్నాయి. ఇందుకు తెలంగాణలోని బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది. ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ షో 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్‌-2022 ఇవాళ ప్రారంభం కానుంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నాలుగురోజుల పాటు ఈ వేడుక జరగనుంది.

Wings India Aviation Show
తెలంగాణలో నేడే 'వింగ్ ఇండియా' ఏవియేషన్‌

By

Published : Mar 24, 2022, 9:13 AM IST

Wings India Aviation Show: పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేతుల మీదుగా వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో తెలంగాణలో లాంఛనంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో ఏవియేషన్ షో కనువిందు చేయనుంది. ఏవియేషన్ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ … ఈ వేడుకకు కొన్నేళ్లుగా ఆతిథ్యం ఇస్తోంది. బేగంపేటలో జరిగే ఏవియేషన్‌షోలో వివిధ దేశాలకు చెందిన విమానాల ప్రదర్శనతో పాటు.. బిజినెస్ ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటనలు, పాలసీల తీర్మానాలు, రీజనల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టనున్నారు. ఈ సారి సమ్మిట్ ప్రధానంగా హెలికాప్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఎంఆర్వో పాలసీ, ఫ్లైయింగ్ ట్రాకింగ్ ఆర్గనైజేషన్ పాలసీలపై చర్చించున్నారు. ప్రదర్శన చివరి రోజు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏవియేషన్ కంపెనీలు, సంస్థలకు అవార్డులను అందజేయనున్నారు.

Wings India Aviation Show: కొవిడ్ కారణంగా గతేడాది కేవలం బిజినెస్ మీట్‌కే పరిమితమైన ఈ షో పూర్తి స్థాయిలో సందడి చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా మొదలు పలు ప్రభుత్వ విభాగాలు, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి పలు ఆర్గనైజేషన్లు, ప్రైవేటు ప్లేయర్స్ పెద్ద సంఖ్యలో పాలుపంచుకోనున్నారు. ఎప్పటిలాగే పలు దేశాలు, ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల ప్రదర్శనతో పాటు.. ఎయిర్ షో వంటి ఈవెంట్‌లు ఉండనున్నాయి.

Wings India Aviation Show: సరికొత్త ఎయిర్‌ బస్‌-350, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రార్స్‌ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ -ఇ-195–ఇ2 విమానాలు కొలువుదీరనున్నాయి. భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వింగ్స్ ఇండియా ఏవియేషన్-2022లో భాగంగా తొలి రెండు రోజులు వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేయగా.. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు అనుమతిస్తారు.

ఇదీ చదవండి:'ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాం'

ABOUT THE AUTHOR

...view details