ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భర్త గొంతు కోసి చంపిన భార్య

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న భర్తను.. భార్య హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

wife killed husband
భర్త గొంతు కోసి చంపిన భార్య

By

Published : Feb 24, 2021, 7:10 AM IST

మద్యం తాగొచ్చి నిత్యం వేధిస్తున్న భర్తను.. భార్య అంతమొందించింది. కట్టుకున్న వాడు పెట్టే బాధలు భరించలేక.. కత్తితో గొంతు కోసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలంలో జరిగింది.

లింగనవాయి గ్రామానికి చెందిన పూసగుళ్ల మద్దిలేటి.. భార్యపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. సోమవారం రాత్రి మద్యం సేవించి.. ఎప్పటిలాగే భార్య చిన్నమ్మతో వాగ్వాదానికి దిగాడు. భర్త వేధింపులు తాళలేక... ఆగ్రహంతో ఆమె... భర్తను హత్య చేసింది. మృతుడి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details