రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే ఏకగ్రీవాలు జరగవన్న భయం వైకాపా నేతల్లో కనబడుతోందని ప్రజలు అనుకుంటున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
రాజస్థాన్లో స్థానిక సంస్థల ఎన్నికలు, బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తే పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్ల అనుమానం వస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకించిన రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని గమనించాలన్నారు.