ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీ అలర్ట్​.. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన..! - ఏపీ తాజా వార్తలు

TS Weather Report: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

TS Weather Report
భారీ వర్ష సూచన

By

Published : Sep 18, 2022, 7:41 PM IST

TS Weather Report: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం వైపునకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details