రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపైగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయంపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని అమరావతి పరిరక్షణ సమితి(ఐకాస) తెలిపింది.
'గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం'
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించడాన్ని అమరావతి పరిరక్షణ సమితి తప్పుబట్టింది. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఐకాస నేతలు ప్రకటించారు. రాజధానుల వికేంద్రీకరణ నిర్ణయం కోర్టులో నిలవదని అభిప్రాయపడ్డారు.
amaravati jac
రాజధానుల వికేంద్రీకరణ నిర్ణయం కోర్టులో నిలవదని అమరావతి ఐకాస నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరహాలోనే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని చెప్పారు. శనివారం అన్ని పార్టీలు, రైతుసంఘాలు, మేధావులతో చర్చిస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని తీర్మానం చేసిన భాజపా తమతో కలిసి రావాలని వారు కోరారు. అలాగే అమరావతి రైతుల తరఫున పవన్ కల్యాణ్ నిలబడాలని విజ్ఞప్తి చేశారు.