కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గ్రామాల్లో వైరస్ విస్తరిస్తుండటం.. గ్రామ దేవతల కోపానికి ఫలితంగానే అని ప్రజలు భావిస్తున్నారు. ఊళ్లలో ముడుపులు కడుతూ గ్రామం వదిలి వనభోజనాలకు వెళ్తున్నారు.
ఆ గ్రామస్థులు ఊరంతా ఖాళీ చేశారు.. ఎందుకంటే..! - bebepet news
కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామాల్లో విజృంభిస్తోంది. ఊళ్లలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామదేవతలు కోపానికి రావటం వల్లే ఇలా జరుగుతుందని భావించి... ఊరంతా ఖాళీ చేశారు.
bebepet telangana
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేటలో సైతం వనభోజనాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గాలని గ్రామస్థులు ముడుపు కట్టి గ్రామ శివారులో వనభోజనాలకు వెళ్లారు. గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ప్రతి ఇంటికీ తాళం కనిపించింది. డప్పు చప్పుళ్లతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: