ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయమ్మ లేఖ ఆశ్చర్యకరంగా ఉంది: అయ్యన్నపాత్రుడు - Ayyannapatrudu comments on vijayamma

విజయమ్మ లేఖ ఆశ్చర్యకరంగా ఉందని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణకు సహకరించడం లేదని సీబీఐ చెపుతోందని అన్నారు. వివేకాది హత్య కాదు గుండెపోటు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్న మాట విజయమ్మకు గుర్తులేదా అని ప్రశ్నించారు.

అయ్యన్నపాత్రుడు
అయ్యన్నపాత్రుడు

By

Published : Apr 6, 2021, 5:03 PM IST

అయ్యన్నపాత్రుడు

వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖ ఆశ్చర్యకరంగా ఉందని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. లేఖ విజయమ్మకు చెప్పే విడుదల చేశారా లేక జగన్ ఇచ్చేశారా అని ఎద్దేవా చేశారు. జగన్ రెండేళ్లు సీఎంగా ఉండి విచారణ ఎందుకు పూర్తి చెయ్యలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణకు సహకరించడం లేదని సీబీఐ చెపుతోందని అన్నారు.

చెల్లి దిల్లీ వెళ్లి మాట్లాడితే.. తాను ఉన్నాను అని అన్న జగన్ ఎందుకు ప్రకటించడం లేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వివేకాది హత్య కాదు గుండెపోటు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్న మాట విజయమ్మకు గుర్తులేదా అని ప్రశ్నించారు. నాడు ఓదార్పు అని యాత్ర చేసిన విజయమ్మ.. ఇప్పుడు వివేకా కూతురు దిల్లీలో తిరుగుతుంటే ఎందుకు ఓదార్చడం లేదని దుయ్యబట్టారు. జగన్​ను మందలించే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details