VP Venkaiah Tributes to Rosaiah: రాజకీయాల్లో అజాతశత్రువుగా మహోన్నత విలువలకు కట్టుబడిన వ్యక్తి రోశయ్య.. అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజాజీవితంలో సంప్రదాయాలను పాటించిన గొప్పవ్యక్తి అని కీర్తించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో.. ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. రోశయ్య సతీమణి శివలక్ష్మితోపాటు కుమారులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా.. రోశయ్యతో తనకున్న సుదీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య నిలిచారని కొనియాడారు.
Vice President Venkaiah tributes to Rosaiah: "మహోన్నత విలువలకు కట్టుబడిన వ్యక్తి రోశయ్య" - VC Venkaiah tributes to Rosaiah
Vice President Venkaiah Tributes to Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన ఉపరాష్ట్రపతి.. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.
ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. ఏ రంగంలో ఉన్నా.. అంశాలను చక్కగా అధ్యయనం చేసి, దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం.. వినేవారిని ప్రభావితం చేయడం ఆయన ప్రత్యేకత. సామాన్యులకు సైతం అర్థవంతంగా చెప్పడం రోశయ్య ఘనత. అన్ని సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. ఆర్థిక విషయాల్లో ఆయన ఆరితేరిన దిట్ట. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. మేం అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్లం. సమకాలీన అంశాల గురించి అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. - వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఇవీ చూడండి: