ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎర్రన్నాయుడిపై కోపాన్ని అచ్చెన్నాయుడిపై తీర్చుకుంటున్నారు' - varla ramaih news

మాజీమంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన తీరు బాధాకరమని తెదేపానేత వర్ల రామయ్య అన్నారు. ఎర్రన్నాయుడి పై ఉన్న కోపం, పగ అతని తమ్ముడి పై తీర్చుకున్నారని మండిపడ్డారు.

varla ramayya comments
తెదేపానేత వర్ల రామయ్య

By

Published : Jun 13, 2020, 8:28 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెదేపానేత వర్ల రామయ్య మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని తెదేపానేత వర్ల అన్నారు. భార్యకు చెప్పి వస్తానన్నా అనుమతి ఇవ్వకపోవడం కక్ష కాదా అని దుయ్యబట్టారు. విశాఖలోని అనిశా కార్యాలయానికి ఎందుకు తీసుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వైద్యపరీక్షలు చేసేందుకు విశాఖకు ఎందుకు తీసుకెళ్లలేదని వర్ల ప్రశ్నించారు. ఎర్రన్నాయుడుపై ఉన్న కోపం, పగ తమ్ముడిపై తీర్చుకున్నారని వర్ల విమర్శించారు. ఎర్రన్నాయుడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదును ఏం చేశారు అని వర్ల ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details