ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vaccine: 45ఏళ్లు దాటినవారికి పూర్తయ్యాకే ఇతరులకు టీకా!

45 ఏళ్లు దాటిన వారిలో కనీసం 80% మందికి తొలి టీకా డోసు వేశాక 18 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం జగన్‌ స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు కనీసం వారం నుంచి పది రోజుల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

vaccine
vaccine

By

Published : Jul 3, 2021, 7:18 AM IST

రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారిలో కనీసం 80% మందికి తొలి టీకా డోసు వేశాక 18 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 45ఏళ్లు దాటిన వారిలో ఇప్పటివరకు తొలి టీకా డోసు పొందినవారు 70% మంది వరకు ఉన్నారు. ఇది 80శాతానికి చేరితే 18ఏళ్లు దాటిన వారికి తొలి టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జగన్‌ స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు కనీసం వారం నుంచి పది రోజుల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో తరగతులకు హాజరు కావాలంటే కనీసం తొలి టీకా డోసు పొంది ఉండాలని విద్యార్థులకు సూచనలు అందుతున్నాయి. వారికి టీకా పంపిణీని ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గర్భిణులకు టీకా పంపిణీపై ఐసీఎంఆర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అందాయి. ఇందుకోసం గర్భిణుల నుంచి సమ్మతి పత్రం తీసుకోవాలి. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కూడా స్పష్టత వస్తే వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి:RRR: పొరపాటా..? కావాలనేనా..?: రఘురామ

ABOUT THE AUTHOR

...view details