ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lover suicide in Hyderabad : ప్రియురాలి ఎడబాటు భరించలేక.. ప్రియుడి ఆత్మహత్య - Uttar Pradesh Lover suicide in Hyderabad

Lover suicide in Hyderabad : బతుకుదెరువు కోసం రాష్ట్రంకాని రాష్ట్రానికి వచ్చాడు. దొరికిన పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. స్వస్థంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకొని.. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నాడు. బాగా సంపాదించి.. ప్రేయసిని వివాహమాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అందుకోసమే ఉత్తరప్రదేశ్​ నుంచి తెలంగాణకు వలస వచ్చాడు. కానీ ఇంతలో ఏమైందో.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Lover suicide in Hyderabad
Lover suicide in Hyderabad

By

Published : Jan 2, 2022, 11:49 AM IST

Lover suicide in Hyderabad: ప్రియురాలి ఎడబాటు భరించలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని హైదరాబాద్​ నగరం పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్​ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన వినీత్‌(22) మూడేళ్లక్రితం నగరానికి వలస వచ్చాడు. పలు చోట్ల పనులు చేసుకుంటూ మకాం మారుస్తున్నాడు. తాజాగా మంకాల శ్రీనగర్‌ కాలనీలోని హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మూడేళ్లక్రితం స్వస్థలంలో ఓ యువతి ప్రేమలో పడిన వినీత్‌ బాగా సంపాదించి తిరిగి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలుకన్నాడు. కరోనా కాలంలో అతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకోసం నిరీక్షిస్తున్న ప్రేయసితో నిత్యం చరవాణిలో మాట్లాడేవాడు. శనివారం సాయంత్రం పనులు ముగించుకుని గదికి వచ్చి ఆమెతో చరవాణిలో మాట్లాడాడు.

Uttar Pradesh Lover suicide in Hyderabad : ఏళ్లు గడుస్తున్నా తన వద్దకు తిరిగి రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపం చెందిన వినీత్‌ ఫోన్‌ పక్కన పడేసి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. ఇంతలో అతని గదికి వచ్చిన తోటి కార్మికులు అప్పటికీ లైన్‌లో ఉన్న ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. విషయం తెలుసుకుని వెతుక్కుంటూ వచ్చేసరికే వినీత్‌ మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రియురాలి చరవాణికి ఫోన్‌ చేసి విచారించగా వినీత్‌కు ఏమైందని ప్రశ్నిస్తూ కన్నీళ్ల పర్యంతమైంది. ప్రియుడు మృతిచెందిన సమాచారం ఆమెకు తెలపలేదని ఎస్సై పేర్కొన్నారు.

ఇదీ చదవండి:woman missing: భార్య కోసం భర్తల గాలింపు.. అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details