తెలుగురాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలు చేయాలని ఆదేశించారు.
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఇరురాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... అక్టోబర్ 6న ఇద్దరు సీఎంలు, మంత్రులు, అధికారులతో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయింది. తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
డీపీఆర్‌లు ఇవ్వాలి...
కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ చేపట్టిందన్న షెకావత్... డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడచుకోవాలన్నారు. డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఉద్ఘాటించారు.