ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బిడ్డకు జన్మనిస్తూ భార్య మృతి, రైలు కింద పడి భర్త ఆత్మహత్య - భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

WIFE AND HUSBAND DIED IN HYDERABAD ఏడాది క్రితం వారిద్దరు కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినప్పటికీ ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవనం సాగించారు. తానొకటి తలిస్తే, విధి ఒకటి తలచిందన్న చందానా, ఒకరు చనిపోయారని మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటనలో, రోజులు కూడా నిండని శిశువు అనాథగా మారింది.

wife and husband died
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

By

Published : Aug 20, 2022, 12:37 PM IST

WIFE AND HUSBAND DIED IN HYDERABAD: వారిద్దరు ప్రేమించుకున్నారు అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని.. నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య గర్భం దాల్చింది. ఇంతలో వారి దాంపత్య జీవితాన్ని విధి చిన్నచూపు చూసింది. రెండురోజుల క్రితం భార్యకు పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు. ఆమె పండంటి పాపకు జన్మనించి తనువు చాలించింది. దీంతో భార్య ఎడబాటును జీర్ణించుకోలేక ఆమె మృతదేహం మార్చురీలో ఉండగానే భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పాప వెంటిలెటర్​పై ఉండగా.. భార్యాభర్తల మృతదేహాల మార్చురీలో ఉన్నాయి. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మౌలాలీ ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, నారాయణపేట్ జిల్లా మక్తల్​కు చెందిన నవీన్ కుమార్ ఇంటిపక్కనే ఉండే భీమేశ్వరి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చాలా మంది జీవితాల్లో జరిగినట్లే, ఇక్కడా జరిగింది. వారిరువురి తల్గిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో..పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరానికి వచ్చి కాయకష్టం చేసుకుంటూ, మౌలాలి ప్రగతినగర్​లో నివాసం ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటోను నడుపుతూ కుటుంబపోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలోె గర్భవతి అయిన భార్యకు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే పక్కింటి మహిళను సాయంగా తీసుకుని నేరేడుమెట్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

వారి అన్యోన్య జీవితానికి సాక్షిగా పండంటి పాపకు జన్మనించింది భీమేశ్వరి. అయితే ప్రసవం అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు కూతురును గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాపును వెంటిలేటర్​పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి మృతిచెందింది. ఒకవైపు పాప వెంటిలెటర్​పై, మరోవైపు కట్టుకున్న భార్య చనిపోవడంతో ఆమె ఎడబాటును జీర్ణించుకోలేని నవీన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఆర్పీఎఫ్ హోంగార్డు గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి జేబులో లభ్యమైన మొబైల్​ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం భార్యాభర్తల మృతదేహాలు గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details