ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నేత పీవీపీకి హైకోర్టులో స్వల్ప ఊరట - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

వైకాపా నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్​కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. పీవీపీ ముందస్తు బెయిల్​పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.

ts-high-court-has-issued-an-interim-order-on-pvp-bail
ts-high-court-has-issued-an-interim-order-on-pvp-bail

By

Published : Jul 1, 2020, 11:12 AM IST

తెలంగాణ హైకోర్టులో వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కి స్వల్ప ఊరట లభించింది. పీవీపీ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

విల్లా గొడవలో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details