తెలంగాణలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. జోన్‌ల వారీగా విభజించి కరోనా కట్టడికి అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. వీటి ఆధారంగా కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈనెల 20నుంచి రెడ్‌జోన్‌లు మినహా మిగతా చోట్ల షరతులతో కూడిన అనుమతులు జారీచేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు భవన నిర్మాణాలకు అనుమతించింది. అయితే ఇవన్నింటిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో మినహాయింపులపై స్పష్టత ఇవ్వనుంది.
సడలింపులు ఇవ్వాలా? వద్దా?
లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొసాగించడమా లేక కేంద్రప్రభుత్వ సూచనల మేరకు... సడలింపు ఇవ్వాలా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేసింది. పలువురు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతిభవన్‌లో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలు, ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. ఈనెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుండటం వల్ల తీసుకోవాల్సిన చర్యలు కూడా కీలకం కానున్నాయి.
మరికొన్ని రోజులు కఠినంగా..?