Revanth Reddy Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన రేవంత్.. అక్కడకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చారు. దీంతో.. రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పీఎస్‌కు తరలించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు ఇవాళ ఉదయం గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి నిన్న వెల్లడించారు.