- సీబీఐకి ఏం చెప్పొద్దు.. 20 ఎకరాల భూమి ఇస్తాం.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!
మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. పులివెందుల కోర్టులో ఇవాళ నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు
రేపు మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- GVL: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది: భాజపా ఎంపీ జీవీఎల్
ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని.. ఆయన మండిపడ్డారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మణిపుర్లో ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'
Manipur Polls 2022: మణిపుర్ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఎన్పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం- ఆరుగురు అరెస్ట్