- VISAKHA AGENCY BEAUTY: మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వంజంగికి పర్యాటకుల తాకిడి
విశాఖ మన్యంలో పెరిగిన చలి తీవ్రత, పొగమంచుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రకృతి అందాలను తిలికించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో తీవ్ర రద్దీ నెలకొంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- East godavari accident: చెట్టును ఢీకొట్టిన కారు...ఇద్దరు మృతి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును... కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- chandrababu:'రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అమరావతే'
అమరావతిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు విశేష ఆదరణ లభించడమే.. దానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- NITI AAYOG: భూముల అమ్మకం కేంద్ర ప్రభుత్వ విధానం కాదు
NITI AAYOG: నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘బిల్డ్ ఏపీ మిషన్’పై జరిగే విచారణలో ఇంప్లీడ్ కాలేమని పరోక్షంగా స్పష్టం చేసింది. ప్రధాన రంగాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల అభివృద్ధి కోసం మాత్రమే ఆస్తులను మానిటైజ్ చేస్తుందని నీతిఆయోగ్ పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- India Covid cases: దేశంలో కొత్తగా 7వేల కరోనా కేసులు
దేశంలో మరో 7,081 కరోనా కేసులు నమోదయ్యాయి. 264 మంది మరణించారు. శనివారం 76,54,466 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆత్మాభిమానమే ముఖ్యం.. రారాజుకు నిర్మానుష్య స్వాగతమే!
ఇక్కడున్న ఆంగ్లేయ కలెక్టర్‌కే ఎక్కడలేని రాచమర్యాదలు సాగుతుంటే.. ఇక ఇంగ్లాండ్ నుంచి ఏకంగా రారాజే వస్తే ఎలా ఉంటుంది? ఎంత హంగామా ఉంటుంది? అలా ఊహించుకునే 1921లో భారత్‌లో అడుగుపెట్టిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్.. ఎడ్వర్డ్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. నిర్మానుష్యమైన వీధులు.. నిరసనలు, హర్తాళ్‌లు, దాడులతో కూడిన వాతావరణం ఆహ్వానం పలికింది. పర్యటనంతా అవమానకరంగా ముగిసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పిల్ల కొండముచ్చు కోసం తల్లి విలవిల
ఉత్తరాఖండ్ గోపేశ్వర్‌లో.. ఓ పిల్ల కొండముచ్చు మరణంపై ఓ తల్లి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. అనుకోకుండా ట్రాన్స్ఫార్మర్పై చనిపోయి పడి ఉన్న తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లి అక్కడక్కడే తిరుగుతూ ఉండటం ఓ వీడియోలో కనిపించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హాంకాంగ్‌లో ఎన్నికలు.. చైనాకు వంతపాడేవారికే సీటు!
Hong Kong elections: ఎన్నికల విధానంలో చైనా మార్పులు చేసిన తర్వాత.. హాంకాంగ్‌లో తొలిసారి ఓటింగ్ జరుగుతోంది. అయితే, ఆశించిన స్థాయిలో ప్రజలు ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. చట్టసభకు నేరుగా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను కుదించి.. తమ చెప్పుచేతల్లో ఉండే వారిని నామినేట్ చేసే విధంగా చైనా ఎన్నికల చట్టాల్లో మార్పులు చేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 2021లో టాప్-10 వన్డే బ్యాటర్లు వీరే.. భారత్ నుంచి ఒక్కరూ లేరు!
Most ODI Run getters in 2021: ఈ ఏడాది ముగింపు దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.
- 'రన్‌వే 34' షూటింగ్ పూర్తి.. త్వరలో 'ధర్మస్థలి' విడుదల
బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవగణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. అజయ్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం 'రన్‌వే 34' చిత్రీకరణ పూర్తైనట్లు శనివారం ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి