ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ap trending news

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Sep 23, 2021, 5:01 PM IST

  • కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు(IAS officers contempt of court case) సింగిల్ జడ్జి విధించిన శిక్షను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు నష్టపరిహారం ఇవ్వటంలో జాప్యం చేశారంటూ గతంలో హైకోర్టు(high court)లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొప్పర్రులో వైకాపా శ్రేణులకు హోంమంత్రి పరామర్శ

రాష్ట్ర హోమంత్రి సుచరిత కొప్పర్రులో వైకాపా శ్రేణులను పరామర్శించారు. వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే తాను కొప్పర్రులో పర్యటిస్తున్నాని ఆమె చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బ్రిటీష్ పత్రికలో తెలుగు బుడతడి ఘనత

అనీశ్వర్ ఆరేళ్ల చిన్నారి... కానీ అతడి ఆలోచన మాత్రం పెద్దవాళ్లను సైతం ఆలోచింపజేసేది. అతనిలోని ఆ ఆరాటమే..ఇంగ్లాండ్ పత్రిక ది టైమ్స్ లో ప్రచురించేలా చేసింది. ఇంతకీ ఎవరీ పిల్లాడు.. ఏంటతని గొప్పతనం అంటారా...? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వారు ఎంపీలే.. కానీ సరదాగా కాసేపు అలా..!

విశాఖలోని అరకులోయ పర్యటనకు వచ్చిన పార్లమెంట్ సభ్యుల బృందం.. గిరిజనుల వస్త్రధారణలో సందడి చేశారు. ఎంపీల బృందంలోని అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళలోని ఆలూరు ఎంపీ హరిప్రియ తదితరులు.. గిరిజనుల సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దారుణం.. బాలికపై 33 మంది సామూహిక అత్యాచారం

దేశంలో మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఠాణెలో ఓ మైనర్​పై 33 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వారితో కలిసి సీఎం భాంగ్రా డ్యాన్స్

పంజాబ్ సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi).. ఓ కార్యక్రమంలో భాంగ్రా డ్యాన్స్​తో అదరగొట్టారు. కపుర్​థలాలోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో (Punjab Technical University) నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా ఉద్యోగమేళా ముగింపు సమావేశం, బీఆర్ అంబేడ్కర్ మ్యూజియం భూమి పూజలో చన్నీ పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఆశ చూపి బాలికపై రేప్!

వీధుల్లో యాచించుకుని బతికే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కిరాతుకుడు. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ్​లో జరిగింది. కాగా.. ఛత్తీస్​గఢ్​లో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మార్కెట్ల రికార్డుల మోత- తొలిసారి 59,850 పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు (Stock Market) రికార్డులు తిరగరాశాయి. బుల్​ జోరుతో.. సెన్సెక్స్ (Sensex Today) 958 పాయింట్లు పెరిగి.. తొలిసారి 59,850 మార్క్​ దాటింది. నిఫ్టీ (Nifty Today) 276 పాయింట్ల లాభంతో మొదటిసారి 17,800 ఎగువకు చేరింది. దాదాపు అన్ని రంగాలు లాభాలను గడించాయి. బ్యాంకింగ్ షేర్లు దూకుడు ప్రదర్శించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సన్​రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి!. కారణాలివే!

ఐపీఎల్ 2021(ipl 2021 live)లో పేలవ ఆటతీరుతో వరుస ఓటముల్ని చవిచూస్తోంది సన్​రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad team 2021). చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక, భారీ స్కోర్ సాధించలేక చతికిలపడుతోంది. తాజాగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఓడి.. ప్లేఆఫ్స్​(sunrisers hyderabad playoffs) ఆశల్ని దాదాపు గల్లంతు చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మంచు విష్ణు ప్యానల్​కు నరేశ్​ మద్దతు

'మా' ఎన్నికల్లో(maa elections manchu vishnu panel) మంచు విష్ణు ప్యానల్​కు మాజీ అధ్యక్షుడు నరేశ్(naresh maa president)​ మద్దతు ఇచ్చారు. ప్యానల్​లో చదువుకున్నవాళ్లు, అనుభవజ్ఞులు ఉన్నారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details