ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

ఏపీ ప్రధాన వార్తలు

Top News 3PM
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 18, 2022, 3:03 PM IST

  • NIA : ఉగ్రమూలాల అనుమానంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్‌ఐఏ తనిఖీలు
    NIA searches: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్‌ఐఏ సోదాలు సోదాలు చేస్తోంది. నెల్లూరు జిల్లా ,బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్‌లో పీఎఫ్‌ఐ కేసులో నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా..ఓ వర్గం ప్రజలు ఎన్‌ఐఏ అధికార్లను అడ్డుకున్నారు. నంద్యాలలో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి మున్సిపాలిటీకి 5గురు అనుకూలం.. 22 గ్రామాలు వ్యతిరేకం
    Amaravati Gram Sabha's : అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుపై గ్రామసభలు ముగిశాయి. 6 రోజులపాటు 22 గ్రామసభలు జరగ్గా.. అన్నిచోట్లా మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ది చేయాలని తెలిపాయి. మున్సిపాల్టీ ఏర్పాటుతో తమకు ఒరిగేదేమి లేదంటూ ప్రభుత్వ ఎత్తుగడను రాజధాని గ్రామాల ప్రజలు తిప్పికొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే.. అమరావతిపై సుప్రీం లో పిటిషన్
    రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలని, 6 నెలల్లో దీన్ని అభివృద్ధి చేయాలంటూ..హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు చెల్లదని పిటిషన్‌ వేసింది. పాలన ఎక్కడి నుంచి నిర్వహించాలని నిర్ణయించుకునే హక్కు, సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని ఈ అధికారం రాష్ట్రానికి లేదనడం రాజ్యాంగ విరుద్ధని పిటిషన్‌లో వెల్లడించింది. హైకోర్టు తీర్పును నిలువరించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనకాపల్లిలో కలవరం.. బుసలు కొట్టిన 15 అడుగుల గిరినాగు
    Giri Naagu Found in Crop : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో మరో గిరినాగు కలకలం రేపింది. స్థానికులు.. ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు కొన్ని గంటల పాటు శ్రమించి గిరినాగును పట్టుకున్నారు. ఈ పాము పొడవు 15 అడుగులు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నిద్రిస్తున్న తల్లీకూతుళ్ల తలలు నరికి హత్య.. మొరుగుతోందని కుక్కను కాల్చి చంపిన వ్యక్తి
    ఇంటి బయట పడుకున్న దళిత వర్గానికి చెందిన తల్లీకూతుళ్లను నరికి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అమరోహా జిల్లాలో జరిగింది. కర్ణాటక బెంగళూరులో జరిగిన మరో ఘటనలో కుక్క తరచూ మొరుగుతోందని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. తుపాకీతో కాల్చి చంపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'
    కరోనా.. మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. కానీ.. 110 ఏళ్ల క్రితం ఇదే పేరుతో వచ్చిన ఓ యంత్రం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఎప్పుడైనా విన్నారా? చూడముచ్చటైన, తేలికపాటి కరోనా టైప్​రైటర్​ను కొనేందుకు అనేక మంది ఆసక్తి చూపేవారని తెలుసా? కరోనాతోపాటు మరికొన్ని ఫేమస్ టైప్​రైటర్ల కథలు తెలియాలంటే.. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని మ్యూజియంకు వెళ్లాల్సిందే.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది దుర్మరణం
    హైవేపై బస్సు బోల్తా పడిన ఘటనలో 27 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చైనాలోని సండూ కౌంటీలో ఆదివారం జరిగిందీ ప్రమాదం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆరోగ్య బీమా సంస్థల ఆగడాలకు చెక్​! ఇకపై పాలసీలన్నీ ఒకేచోట
    Bima Sugam IRDAI: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ఆరోగ్య బీమా లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కరోనా తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది.. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అధిక ప్రీమియం వల్ల కొందరు పాలసీ తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్‌డీఏఐ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విరాట్ కోహ్లీ న్యూ హెయిర్​ స్టైల్​​.. ఫొటోలు వైరల్​!
    ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్​కు ముందు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్​లో దర్శనమిచ్చాడు. న్యూ హెయిర్ స్టైల్​తో ఆకట్టుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సామ్​కు జోడీగా 'శాకుంతలం'లో ఆ స్టార్​ హీరో.. ఫస్ట్​ లుక్​ చూశారా?
    సమంత హీరోయిన్​గా తెరకెక్కుతున్న 'శాకుంతలం' మూవీ నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. సామ్​కు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో కనిపించనున్న మలయాళం హీరో ఫస్ట్​లుక్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details