ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Jul 16, 2022, 10:56 AM IST

  • Floods: గోదావరి మహోగ్రరూపం..అల్లాడిపోతున్న జనం
    Floods: ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమవ్వటంతో.. ప్రజల ఇబ్బందులకు గురయ్యారు. గోదావరి ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వరదలపై సీఎం జగన్ సమీక్ష.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
    CM Jagan Review on Flood situation: రాష్ట్రంలో వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఇవాళ ఉదయం అధికారులతో చర్చించిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి.. కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు
    KRMB: శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు అనధికారికంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అనధికారిక నీటి వినియోగాన్ని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బాపట్లలో మద్యం తాగి ఇద్దరి మృతి.. విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని లోకేశ్ ఫైర్
    Lokesh fires on YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకొని తాగిన తర్వాతే వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నీటమునిగిన తెలంగాణ ప్రాజెక్టుల పంపుహౌస్ ల పునరుద్దరణకు 6 నెలల సమయం..!
    Medigadda and Annaram Pump Houses: వరదనీటిలో మునిగిన కాళేశ్వరం పంపుహౌస్‌లోని పంపులు, మోటార్ల పరిస్థితిపై అంచనా వేయడంలో తెలంగాణ నీటిపారుదలశాఖ నిమగ్నమైంది. అన్ని పంపులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొచ్చిలో ఫ్లైట్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 45 నిమిషాల వ్యవధిలో!
    సాంకేతిత లోపం కారణంగా షార్జా వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా జి9-26 విమానాన్ని కేరళ విమానాశ్రయంలో దింపారు సిబ్బంది. మరోవైపు ఇండిగో విమానం ఇంజిన్​ కుదుపులకు గురవడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న విమానాన్ని జైపుర్​కు దారి మళ్లించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆగని కరోనా ఉద్ధృతి.. మూడోరోజూ 20 వేలకుపైగా కేసులు
    Covid Cases In India: భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,038 మంది వైరస్​ బారిన పడగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 7,76,088 కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్​లో ఆందోళనకర స్థాయిలో ఒక్కరోజే 1,07,959 కేసులు వెలుగు చూశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ప్రధానిగా సునాక్​ తప్ప ఇంకెవరైనా ఓకే.. అతను నాకు ద్రోహం చేశాడు'
    బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్​ను ఎన్నుకోవద్దని మద్దతుదారులకు మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ద్రవ్యోల్బణంలోనూ డాలరుదే హవా.. బలపడుతున్న అమెరికా కరెన్సీ
    అమెరికాలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా నమోదైంది. అదే మన దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01 శాతమే. యూరోను కరెన్సీగా వినియోగిస్తున్న 19 ఐరోపా దేశాల్లో కూడా జూన్‌ ద్రవ్యోల్బణం 8.6 శాతమే. అంటే మనదేశం, ఐరోపా కంటే అమెరికాలోనే ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అమెరికా జట్టులో ఆంధ్ర ప్లేయర్​.. ​అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం
    Andhra cricketer Duvvarapu Sivakumar USA Squad: ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడతడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Ponniyan Selvan: సింగిల్​ సాంగ్​.. 300మంది డ్యాన్సర్స్​, 25 రోజుల షూటింగ్‌
    Ponniyan Selvan song: అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌-1' గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులోని ఓ పాట కోసం పది, ఇరవై కాదు ఏకంగా 300 మంది డ్యాన్సర్లను తీసుకున్నారట. ఇందులో 100మంది ముంబయికి చెందిన డ్యాన్సర్లు ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details