ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Jul 11, 2022, 8:58 AM IST

  • Rains: నేడు, రేపు భారీ వర్షాలు
    Rains: రాష్ట్రంలో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో.. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరం ప్రాజెక్టుకు.. కొనసాగుతున్న వరద ఉధృతి
    ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో.. గోదావరికి వరద పోటెత్తింది. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. వరద కారణంగా ప్రాజెక్టు స్పిల్​వేలోని 48 రేడియల్ గేట్ల వద్ద భారీగా వరద నీరు చేరటంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అదాన్​ డిస్టిలరీస్​ మీ కంపెనీయే: తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
    Adan distilleries: అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలకు సంబంధించినదేనని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై తాను విజయసాయిరెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. తాము చెప్పిన విషయాలకు సంబంధించిన పత్రాలన్నింటినీ తెదేపా వెబ్‌సైట్‌లో పెడుతున్నామని కావాలంటే చూసుకోవచ్చొని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం
    తొమ్మిది ప్రధాన డిమాండ్లతో పారిశుద్ధ్య కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దాదాపు 35వేల మంది విధులకు దూరం కానున్నారు. వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్​తో..
    BJP South India plan: ఉత్తరాదిలో ఘన విజయాలు సాధిస్తున్న భాజపా.. దక్షిణ భారతదేశంపై గురిపెడుతోంది. 2019లో పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో సాధించిన ఫలితాలను ఇక్కడ ఈసారి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకను మినహాయిస్తే దక్షిణాదిలో మిగిలిన 101 లోక్‌సభ స్థానాల్లో నాలుగే గెలుచుకున్న కమలం పార్టీ.. ఈ పరిస్థితిని మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
    మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్, తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్ వంద పర్సంటైల్ సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థిగా రిషి సునాక్‌కే మొగ్గు.. బరిలోకి విదేశాంగ మంత్రి!
    బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ స్థానాన్ని మాజీ మంత్రి రిషి సునాకే భర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేసులో ఉన్న తొమ్మిది మందిలో సునాక్​ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెబీ నుంచి మార్కెట్‌ సమాచారం!.. పెట్టుబడుల్లో మూక ధోరణి తొలగించేందుకే
    మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మదుపర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 'మార్కెట్‌ నష్టభయం కారణాల వివరాల'ను తరచు వెల్లడించేలా సన్నాహాలు చేస్తోంది. నష్టభయం అంశాలన్నింటినీ సంస్థలు వెల్లడించాల్సిందేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అవమానాలు.. విమర్శలు.. ప్రతికూలతలు.. అయినా జకో తగ్గేదేలే!
    Novak Djokovic Wimbledon: 'ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవాలంటే ముందు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉండాలి' అని చెప్పే జకోవిచ్..​ దాన్ని చేతల్లోనూ నిరూపిస్తున్నాడు. టెన్నిస్​లో ఆల్‌టైమ్‌ దిగ్గజంగా ఎదిగేలా దూసుకెళ్తున్నాడు. వింబుల్డన్ 2022 విజేతగా నిలిచిన నొవాక్ జకోవిచ్ పస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో రెండో స్థానానికి చేరాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హీరోయిన్ల డబుల్‌ ట్రీట్‌.. నెల వ్యవధిలోనే రెండోసారి!
    ఓ వైపు జోరుగా వానలు.. మరోవైపు బాక్సాఫీస్‌ ముందు కొత్త చిత్రాల సందడి. ఎటు చూసినా ఓ ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పుడీ చల్లని గాలుల్లో సినీప్రియులకు పసందైన వినోదాల్ని కొసరి కొసరి వడ్డించనున్నారు కథానాయికలు. వరుసగా రెండేసి చిత్రాలతో డబుల్‌ ట్రీట్‌ అందివ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details