ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@ 9AM

TOP NEWS: ప్రధాన వార్తలు@ 9AM

By

Published : Jun 4, 2022, 9:03 AM IST

TOP NEWS
TOP NEWS

  • మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే.. జరగబోయేది అదే : పవన్
    Pawan Kalyan: రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఒట్లు చీలకూడదనే పొత్తుల బాటన్న ఆయన... భాజపా, జనసేన కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తానుంటాననేది కేవలం ప్రచారమేనన్నారు. కోనసీమ అల్లర్ల వెనక ప్రభుత్వ పాత్ర ఉందని జనసేన పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. జిన్నా పేరు విభజనతో ముడిపడి ఉందన్న పవన్​...స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ముస్లిం నేతల్లో ఎవరో ఒకరిపేరు జిన్నాటవర్‌ సెంటర్‌కు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పల్నాడులో రాజకీయ కాష్ఠం.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
    పల్నాడులో రాజకీయ కాష్ఠం రగులుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి 2 నియోజకవర్గాల్లో 6 హత్యలు చోటుచేసుకోవడం... ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. నడిరోడ్డుపై పట్టపగలే దాడులు చేసి, మారణాయుధాలతో చంపేస్తున్నా... ఏమాత్రం పట్టించుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ANANTHA BABU: తోటి ఖైదీపై ఎమ్మెల్సీ అనంతబాబు దాడి... ?
    ANANTHA BABU: మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని తెలుస్తోంది. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "లోకేశ్, అచ్చెన్నాయుడి పేర్లు చెప్పాలని.. సీఐడీ అధికారులు ఒత్తిడి తెచ్చారు"
    ITDP coordinator Venkatesh: ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేశారనే అభియోగాలపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ "ఐ టీడీపీ" కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌ను రెండో రోజూ సీఐడీ విచారించింది. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు పదే పదే చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెనాయుడు పేర్లు చెప్పాలని బెదిరించారని వెంకటేశ్‌ తెలిపారు. తన లాయర్‌ను సీఐడీ కార్యాలయంలోకి అనుమతించని అధికారులు.. సాక్షి మీడియా ప్రతినిధిని మాత్రం విచారణ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉంచారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెద్దలసభకు 41 మంది ఏకగ్రీవం.. జాబితాలో చిదంబరం, సిబల్​
    Rajya Sabha Polls: రాజ్యసభకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 41 మంది ఏకగ్రీవమయ్యారు. జూన్​ 10న మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో పోటీలేని 41 స్థానాల్లోని అభ్యర్థులను రిటర్నింగ్​ అధికారులు ప్రకటించారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి పి.చిదంబరం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్‌ తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కన్నబిడ్డపై రేప్.. తల్లిదండ్రులకు కోర్టు మరణ శిక్ష.. లిఫ్ట్​లో బాలికకు వేధింపులు
    Child Sexual abuse Death penalty: కన్నబిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన తల్లిదండ్రులపై న్యాయస్థానం కొరడా ఝులిపించింది. దోషులకు మరణ శిక్ష విధించింది. మరోవైపు, లిఫ్ట్​లో బాలికను వేధించాడు ఓ బాలుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 100 రోజుల యుద్ధం.. వేల మంది బలి- అంతా విధ్వంసం.. ఆపేదే లేదన్న పుతిన్
    Russia Ukraine War 100 days: ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో వినాశనం చోటుచేసుకుంది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోయారు. మరోవైపు, ఈ యుద్ధం ఆపేది లేదంటూ రష్యా అధినేత పుతిన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అదానీని వెనక్కినెట్టి.. ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీనే.. మరి ప్రపంచంలో?
    Mukesh Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టారు. గతకొద్ది రోజులుగా రిలయన్స్​ షేర్లు దూసుకెళ్లడం, అదానీ గ్రూప్‌ షేర్లు క్షీణించడం వల్ల ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్​ అంబానీ నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ISSF World Cup 2022: మెరిసిన అంజుం.. షూటింగ్​ ప్రపంచకప్​లో రజతం
    ISSF World Cup 2022: షూటింగ్​ ప్రపంచకప్‌లో రజతంతో సత్తాచాటింది అంజుం మౌద్గిల్‌. అజర్‌బైజాన్‌లో శుక్రవారం జరిగిన స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్‌ ఇబ్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇక ఆ సినిమాల జోరు.. వేసవి సీజన్​ను మరిపించేలా!
    తెలుగు సినిమా వేసవి సీజన్‌ దాదాపుగా పూర్తయినట్టే! అంచనాలున్న సినిమాలు.. అగ్ర తారల చిత్రాలు కొన్ని నెలలుగా పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. బాక్సాఫీసు లెక్కలు, రికార్డుల మాటలెలా ఉన్నా.. రానున్న సినిమాల వరుస చూస్తుంటే వేసవిని మించి మరో సీజన్‌ ముందుందని స్పష్టమవుతోంది. మధ్య స్థాయి బడ్జెట్‌తో కూడిన సినిమాలు, యువ కథానాయకుల చిత్రాలు ఈ నెల నుంచే వరుసకడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


ABOUT THE AUTHOR

...view details