- Water issue: ఆ పనులే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది: షెకావత్
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే దురదృష్టకర సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విచారం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డులు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వాటి పరిధిని నోటిఫై చేశామని.. జ్యూరిస్‌డిక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత బోర్డు శక్తి మరింత పెరుగుతుందని ఆయన లోక్‌సభలో తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పులకు గ్యారంటీ అక్కర్లేదు: ఆర్థిక మంత్రి బుగ్గన
రుణం చెల్లిస్తున్నంత వరకు రాష్ట్ర చేసిన అప్పులకు సంబంధించి ఒప్పందం ప్రస్తావనే రాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలకే అప్పులు చేశామని వివరణ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ .. ఏపీఎస్డీసీ చేసిన అప్పులను గుట్టుగా పెట్టారనడం సరికాదన్నారు. జీవో నంబర్లు చెబుతూ గుట్టు అనడమేమిటని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "మాకు జ్ఞానోదయమైంది.. ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం"
రాజధాని భూముల కొనుగోళ్ల విషయానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అనుమతినిస్తూ.. ఎస్సెల్పీ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- vmrda master plan: బృహత్తర గండం.. చక్రబంధంలో భీమిలి-భోగాపురం
జలవనరులు, గ్రామాల మీదుగా విశాఖ అభివృద్ధి సంస్థ రూపొందించిన రోడ్ల ప్రతిపాదన స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వేల ప్లాట్లను కోల్పోనున్నామనే ఆవేదన యజమానుల్లో వ్యక్తమవుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 20 ఏళ్లకు ఈ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదా సిద్ధం చేశారు. అయితే... భీమిలి, భోగాపురం మండలాల్లో ప్రతిపాదించిన రహదారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం మేలు'
వివాదాల పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' అత్యుత్తమ అనుసరణీయ విధానాల్లో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. బ్రిటిష్ వారి రాకకు ముందునుంచే దేశంలో ఈ విధానం ఉందని చెప్పారు. సులువుగా, వేగంగా, తక్కువ ఖర్చులో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వాటర్‌గేట్ కుంభకోణం కంటే పెగాసస్ దారుణం'