- విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి
విశాఖలోని థాంసన్ స్ట్రీట్ వద్ద ప్రియాంక అనే యువతిపై.. యువకుడు శ్రీకాంత్ దాడి చేసిన ఘటనపై.. బాధితురాలి కుటుంబీకులు తీవ్రంగా స్పందించారు. ప్రియాంకపై.. అన్యాయంగా దాడి చేశారని ఆవేదన చెందారు. శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించాడని.. ప్రియాంక ఒప్పుకోలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు... జనసేనాని పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు పవన్ ముందు కంటతడి పెట్టగా... నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు..
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కడప జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. 4 కోట్ల రూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కోల్‌కతా, బెంగళూరులో 'కొవాగ్జిన్' ఫైనల్ ట్రయల్స్
దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ - కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోల్‌కతా, బెంగళూరులో బుధవారం ప్రారంభమయ్యాయి. బంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్ఖర్, కర్ణాటకలో సీఎం యడియూరప్ప వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. తుది దశ ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- యూపీకి 'బాలీవుడ్' తరలింపుపై రాజకీయ రగడ
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ముంబయి పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులతో ఆయన భేటీ అవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిలింసిటీ నిర్మాణం నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం పర్యటనపై రాజకీయ దుమారం రేగింది. ముంబయి నుంచి బాలీవుడ్‌ను యూపీకి తరలించేందుకు యోగి ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే గల్వాన్ దాడి'
ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా బలగాలు దాడి చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. దాడికి సంబంధించి అనేక విషయాలను తన ద్వారా నివేదిక బట్టబయలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఫైజర్ టీకా వినియోగానికి యూకే ఓకే
కొవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ వినియోగానికి అనుమతులు ఇచ్చింది బ్రిటన్. ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపిన తొలిదేశంగా నిలిచింది. ఈ క్రమంలో వచ్చేవారం దేశవ్యాప్తంగా టీకా అందుబాటులోకి రానుంది. 2021 చివరి నాటికి 4 కోట్ల డోసులు పొందనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'రూ.68 లక్షల కోట్లకు రాష్ట్రాల అప్పులు'
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల అప్పులు భారీగా పెరగొచ్చని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. కరోనాతో తగ్గిన ఆదాయం, పెరిగిన వ్యయాల వల్ల రాష్ట్రాల అప్పులు రూ.68 లక్షల కోట్లకు చేరొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్.. అధికారిక ప్రకటన, అదిరే టైటిల్
డార్లింగ్ ప్రభాస్ మరో కొత్త సినిమా ఒప్పుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి 'సలార్' టైటిల్‌ను నిర్ణయించారు. 'కేజీఎఫ్' నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి