ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 pm - ఏపీ ముఖ్యవార్తలు

.

top news@9pm
ప్రధాన వార్తలు@9pm

By

Published : Jun 7, 2020, 8:57 PM IST

  • కరోనా @199...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 199 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాడీవేడిగా హైపవర్ కమిటీ రెండో రోజు సమావేశం...

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ రెండో రోజు సమావేశం నిర్వహించింది. బాధిత గ్రామస్థులు 21 మందితో పాటు వివిధ రాజకీయ పార్టీలతో హై పవర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అవినీతి.. భూ కుంభకోణాలే ఎక్కువ'...

ఏడాది వైకాపా పాలనలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్​ ఇసుక రీచ్​లను వైకాపా సాండ్​ మాఫియా పరం చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నిబంధనలు పాటించాల్సిందే...

రేపటి నుంచి రాష్ట్రంలో సరిహద్దు చెక్‌పోస్టులను తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోకి రావాలంటే స్పందన వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేసుకోవాలని సూచించింది.పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రుతుపవనాలు వచ్చేశాయి

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. చిత్తూరు జిల్లాలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దివ్య హత్య కేసు: మెజిస్ట్రేట్ ముందుకు నిందితులు

దివ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. కేజీహెచ్​లో వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అన్​లాక్​ 1.o: నిబంధనలివే..

లాక్​డౌన్ ఆంక్షలు సడలిస్తూ అన్​లాక్​ 1.oలో సోమవారం(జూన్ 8) నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రార్థనామందిరాలు, షాపింగ్​ మాల్స్​కు అనుమతులు ఇచ్చింది కేంద్రం. రాష్ట్రంలోనూ ప్రధాన దేవాలయాల్లో భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నాలుగు లక్షలు దాటాయ్...

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. అమెరికాలో లక్షా 12 వేల మంది మరణించగా, బ్రిటన్​, బ్రెజిల్​ దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జావేద్ అక్తర్​కు ప్రతిష్టాత్మక అవార్డు...

ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్.. ప్రతిష్టాత్మక రిచర్డ్ డాకిన్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు అందుకోనున్న తొలి భారతీయుడు ఈయనే కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జియో​లో భారీ పెట్టుబడులు...

భారత టెలికాం​ దిగ్గజం రిలయన్స్​ జియోలో విదేశీ పెట్టుబడుల పర్వం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి పెట్టుబడుల సంస్థ.. 1.16 శాతాన్ని కొనుగోలు చేసినట్లు జియో ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details