- ఏపీ తనవంతు నిధులివ్వలేదు.. 5 ప్రధాన ప్రాజెక్టులు ఆగిపోయాయి : కేంద్రం
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ పై తెదేపా ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు మంజూరు చేయకపోవడం వల్లే.. రాష్ట్రంలోని 5 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని వెల్లడించింది.
- సీఎం టూర్లో పోలీసుల అత్యుత్సాహం.. విమాన ప్రయాణికులకు ఇక్కట్లు..!
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే రహదారుల్లో 3 గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సింధియా, షీలానగర్ ప్రాంతాల్లోని విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?
ప్రభుత్వంతో తమ చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే.. ఉపాధ్యాయ సంఘాలే సమ్మె కొనసాగించాల్సిందని పీఆర్సీ సాధన సమితి నేతలు వ్యాఖ్యానించారు. చర్చల్లో తమతోపాటు ఉన్నవారే.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని, వారి మాటల వెనుక.. కొన్ని శక్తులు దాగి ఉండొచ్చని ఆరోపించారు. పీఆర్సీతోపాటు ఇతర అంశాల్లో తమను విమర్శిస్తూ శవయాత్రలు చేయడం సరికాదన్నారు. 27 శాతం ఫిట్మెంట్ సాధనకు ఉద్యమిస్తే తామంతా స్వాగతిస్తామని చెప్పారు.
- venkaiah naidu in tirumala: పెళ్లి వేడుకలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య
venkaiah naidu in tirumala: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. అనంతరం తన మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
- Power employees protest: రాష్ట్ర వ్యాప్తంగా.. విద్యుత్ ఉద్యోగులు నిరసన
Power employees protest: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
- చింతామణి నాటకం నిషేధంపై.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
HC hearing on Chintamani Drama : చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీ రఘురామ వేసిన ఈ పిటిషన్‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే.. ఈ నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి.
- AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,679 కరోనా కేసులు, 2 మరణాలు
AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,522 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా..1,679 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,598 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొత్తగా మరో ఇద్దరు మరణించినట్లు పేర్కొంది.
- 'కాంగ్రెస్‌ను గెలిపిస్తే రుణమాఫీ, 20లక్షల ఉద్యోగాలు'
congress up manifesto: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. తమను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు రుణ మాఫీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
- విస్తృత ధర్మాసనానికి హిజాబ్ కేసు- కళాశాలల బంద్‌తో కాస్త ప్రశాంతత!
Karnataka Hijab Issue: కళాశాలల్లో హిజాబ్ ధరించి రావడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు.. కర్ణాటకలో ఉన్నత విద్యా సంస్థల మూసివేతతో ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి.