- స్పందించకపోతే... న్యాయ పోరాటం చేస్తాం: లోకేశ్
ప్రభుత్వంపై తెదేపా నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడిలో వైకాపా సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అక్కడ ఆర్టీసీకి ఇప్పుడు ఏమైంది? కరోనా నిబంధనలు పట్టవా?
ఫంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉంచాలి. మరి ఆర్టీసీ బస్సులో భౌతిక దూరం అవసరం లేదా? గతంలో 50 శాతం సీటింగ్‌తో బస్సులు తిప్పిన ఆర్టీసీకి ఇప్పుడు ఏమైంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కన్సల్టెన్సీ ప్రాతిపదికన వైద్య నిపుణులను నియమిస్తాం'
కొవిడ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్ల సంఖ్య పెరుగుతోందని కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ అన్నారు. త్వరలో వైద్య నిపుణలను కన్సెల్టెన్సీ ప్రాతిపదికన నియమిస్తామని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రియుడితో కలిసి బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ విక్రయించిన నర్సు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ నర్సు తన ప్రియుడితో కలిసి రెమ్‌డెసివిర్‌ను విక్రయిస్తూ పట్టుబడింది. రోగులకు సాధారణ ఇంజెక్షన్లు ఇస్తూ, వారి కోసం తెచ్చిన రెమ్‌డెసివిర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆక్సిజన్ అడ్డుకుంటే ఎవరికైనా ఉరిశిక్షే'
ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకుంటే ఉరిశిక్ష విధిస్తామని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా ఉద్ధృతి ఉన్నా.. సంస్కరణలు ఆగవు'
దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు సరైన దిశలోనే వెళ్తున్నాయని తెలిపిన మంత్రి.. రుణాలపై మారటోరియం విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వివాద్ సే విశ్వాస్- చెల్లింపుల గడువు పొడిగింపు
వివాద్ సే విశ్వాస్ పథకం కింద చెల్లింపుల గడువును కేంద్రం రెండు నెలల పాటు పొడిగించింది. జూన్ 30లోపు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెవులాంబ కన్నుమూశారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తమ్ముడిని కిరాతకంగా చంపించిన యువనటి!
కన్నడ నటి నయన.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని సోదరుడినే అతి కిరాతకంగా హత్య చేయించింది. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.