ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3PM - ఏపీ ముఖ్యవార్తలు

....

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM

By

Published : Apr 23, 2021, 3:00 PM IST

  • 'అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది'
    మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని.. అందుకే స్త్రీ సాధికారతకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
    విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై.. టెండర్లు ఖరారు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట భూముల అమ్మకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులే.. విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పరిషత్ ఎన్నికల పిటిషన్లపై విచారణ 30కి వాయిదా
    పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చాయి. ఎస్‌ఈసీ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే కక్ష సాధిస్తున్నారు'
    తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును.. ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, యమనల రామకృష్ణుడు ఖండించారు. జగన్ అక్రమాస్తులపై ధూళిపాళ్ల పోరాడినందుకే రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా నిధులన్నీ కార్పొరేట్లకే!
    అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరోనా ఉపశమన నిధులు ఎక్కువగా కార్పొరేట్లకే వెళుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. అందులో భారత్ కూడా ఉందని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్​ కొరతపై సుప్రీం సీరియస్​
    కొవిడ్‌ నియంత్రణపై కేంద్రం తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అమికస్‌ క్యూరీగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే.. తనను ఈ కేసు నుంచి తప్పుకునేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!
    దేశంలో కరోనా రెండో దశ విజృంభణ మానవాళికి ముప్పుగా తయారైంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాపాయికి హాఫ్ సెంచరీ..అనుష్కకు ముద్దులు...సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ..!
    ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో నమోదు చేసిన తొలి అర్ధసెంచరీని తన కుమార్తె వామికకు అంకితం ఇచ్చాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. హాఫ్​సెంచరీ చేసిన తర్వాత ఆర్​సీబీ బృందంవైపు చూస్తూ తన భార్య అనుష్కకు గాల్లో ముద్దులిచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెలబ్రిటీల ట్రిప్స్​​పై ట్రోలింగ్​​- స్పందించిన శ్రుతి
    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు సరదాగా గడపటానికి వేరే దేశాలకు వెళ్ళడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వారిని విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details