- తిరుపతి ఉపఎన్నిక: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 36.67 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'
తిరుపతి అసెంబ్లీస్థానం పరిధిలో పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోండి: సీఈవో విజయానంద్
తిరుపతి ఉప ఎన్నికలో అవాంఛనీయ ఘటనలు జరగనీయొద్దని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతి పశ్చిమ పీఎస్ ముందు భాజపా అభ్యర్థి రత్నప్రభ ధర్నా
తిరుపతి పోలింగ్ కేంద్రాల్లో నకలీ ఓట్లపై భాజపా ఎంపీ అభ‌్యర్థి రత్నప్రభ ఆందోళన చేపట్టారు. తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బంగాల్: మధ్యాహ్నం 1.30 వరకు 55 శాతం పోలింగ్
బంగాల్లో ఐదో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్న వేళ మధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, కామర్హతిలో ఓ భాజపా పోలింగ్ ఏజెంట్ హఠాన్మరణం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!
పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. మొత్తం నాలుగు కేసుల్లో ఆయన దోషిగా తేలగా.. ఇదివరకే మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా కాలంలో భారీగా పెరిగిన 'ఫార్మా' ఎగుమతులు
భారత్‌లో ఔషధరంగ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఎగుమతులు 18శాతం వృద్ధి సాధించినట్లు ఫార్మాస్యుటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైమానిక దళానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
భారత వైమానిక దళానికి.. అవసరాలకు తగ్గట్టుగా అశోక్ లే ల్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసింది. మొదటి విడతలో భాగంగా కొన్ని వాహనాలను ఐఏఎఫ్‌కు అందజేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పాక్ ఆటగాళ్ల వీసాలకు బీసీసీఐ అనుమతి.. కానీ'
రానున్న పొట్టి ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఆ దేశ మీడియా సిబ్బందికి వీసాలకు అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అభిమానులకు అంగీకారం తెలిపే అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోనిదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నటుడు సోనూసూద్‌కు కరోనా పాజిటివ్
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ రోజు చేసిన కొవిడ్ పరీక్షల్లో సోనూసూద్‌కు పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.